హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వీరభద్రపురంలో డ్రైనేజీ సమస్య

VZM: కొత్తవలస మండలం వీరభద్రపురంలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ వెనుక ఎస్సీ కాలనీలో సరైన డ్రైనేజీ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నిల్వలతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు. హెల్త్ సెంటర్ సమీపంలోనే ఈ దుస్థితి ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.