JGL: మెట్పల్లిలో బుధవారం నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లను ఎస్పీ అశోక్‌కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వట్టివాగు వద్ద నిమజ్జన ప్రదేశాన్ని సందర్శించి భక్తుల రాకపోకలు, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష


