హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైపుల నుంచి వృథాగా తాగునీరు!

నల్గొండ మండలం చిన్నసూరారంలో మిషన్ భగీరథ పైపులైన్లకు కొన్ని చోట్ల నల్లాలు బిగించకపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. సరఫరా సమయంలో నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నల్లాలు బిగించి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.