హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుపాను ప్రభావంపై మంత్రి తుమ్మల సమీక్ష

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. గురువారం కలెక్టర్ అంకిత్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తుపాను ప్రభావం రేపు, ఎల్లుండి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లు, పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.