కోనసీమ: ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో అమలాపురానికి చెందిన రాగిరెడ్డి శ్రవణ్ కుమార్ సత్తా చాటారు. 67 కేజీల విభాగంలో పోటీపడి రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకంతో మొత్తం ఆరు పతకాలు సాధించారు. డెడ్‌లిఫ్ట్‌లో 162.5 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. శ్రవణ్ కుమార్‌ను పలువురు క్రీడాభిమానులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం యువకుడికి 6 పతకాలు


