హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మీ కళ్లు మసకబారుతున్నాయా..?

కళ్లు మసకబారడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది కంటిచూపు మందగించడానికే కాదు, విటమిన్ ఎ లోపం, షుగర్ లేదా కంటిశుక్లం వంటి సమస్యలకూ సంకేతం కావచ్చు. అందుకే ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్ నుంచి కళ్లు పక్కకు తిప్పాలి. క్యారెట్లు, ఆకుకూరలు ఆహారంలో చేర్చడం కంటి ఆరోగ్యానికి మంచిది. రోజూ సరిపడా నిద్రపోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలి.