నిద్రలో పళ్లు కొరకడాన్ని 'బ్రక్సిజం' అంటారు. ఒత్తిడి, ఆందోళన, నిద్ర సమస్యలు, ధూమపానం వల్ల ఈ సమస్య వస్తుంది. ఉదయం లేవగానే దవడ నొప్పి, పంటి నొప్పి, తలనొప్పి దీని ప్రధాన లక్షణాలు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పళ్లు అరిగిపోయి విరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ అలవాటు ఉన్నవారు నిద్రవేళలు పాటించి ఒత్తిడి తగ్గించుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే దంత వైద్యుడి సలహాతో 'మౌత్ గార్డ్' వాడటం ఉత్తమం.
ఆరోగ్యం
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా?


