దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చూసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ ఒక దానిమ్మ పండు లేదా దాని రసం తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారి, నీరసం తొలగిపోతుంది. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారికి ఇది వాపులను తగ్గించడంలో సహకరిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో దానిమ్మ గింజలు చాలా మేలు చేస్తాయి.
ఆరోగ్యం
దానిమ్మ పండుతో సహజ చర్మ కాంతి..!


