అరటిపండులో పొటాషియం, ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తిన్న వెంటనే శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం కండరాల నొప్పులను తగ్గించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అరటిపండు తినడం వల్ల మెదడులో సెరోటోనిన్ హార్మోన్ విడుదలయ్యి మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియ సజావుగా సాగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఆరోగ్యం
అరటిపండుతో అద్భుత ప్రయోజనాలు!


