హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఇమ్యూనిటీని పెంచే పాలకూర..!

పాలకూర వంటి ఆకుకూరలలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను నివారిస్తాయి. అలాగే కంటి చూపును, ఎముకల దృఢత్వాన్ని కాపాడటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. శరీరంలో వాపులను తగ్గించడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఇవి ఎంతో అవసరం. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో కూడా ఆకుకూరలు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి.