JGL: కోరుట్ల పట్టణలోని పెద్దగుండ వద్ద నిర్మిస్తున్న నూతన కోర్టు భవన సముదాయం పనులు చివరి దశకు చేరుకున్నాయి. కోర్టు భవనం, న్యాయమూర్తుల నివాసగృహాలు తదితర నిర్మాణాల కోసం ‘న్యాయ నిర్మాణ్ పథకం’ కింద రూ. 23 కోట్లు మంజూరయ్యాయి. 2023 మార్చి 25న భూమిపూజ నిర్వహించారు. పనులు పూర్తిచేసి త్వరలో ప్రారంభానికి అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
ప్రారంభానికి సిద్ధమవుతున్న కోర్టు భవనం


