ASF: వాంకిడి మండలం ఖమన గ్రామానికి చెందిన బండె మల్లక్క అనే వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన మల్లక్కకు కాలుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె గురువారం తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: వృద్ధురాలి ఆత్మహత్య


