KMM: నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన తేజావత్ బాలాజీ (60) బుధవారం రాత్రి గణేశ్ మండపం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా డ్రైనేజ్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయారు.చీకటి, వర్షం వల్ల రాత్రి ఎవరూ గమనించకపోవడంతో గురువారం ఉదయానికి డ్రైనేజీలోనే మృతిచెంది కనిపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి


