హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.585 టీఎంసీల నీటి నిల్వ

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు జలాశయంలో 1.585 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 389.32 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 168 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, అవుట్‌ఫ్లో లేదు. జలాశయం పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు.