హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ఆయకట్టు రైతులకు మంత్రి జూపల్లి భరోసా

NGKL: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రెండు రోజుల సంప్రదింపుల తర్వాత జూరాలకు నీటి విడుదల ఖరారైందన్నారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందొద్దన్నారు. సాగు, తాగునీటిని ప్రణాళికాబద్ధంగా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.