హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు

MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అనుమతులకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు, ప్రజా రాకపోకలకు ఆటంకం కలిగించే కట్టడాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సెల్లార్, స్టిల్ట్ పార్కింగ్ దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.