హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఇవాళ ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.50 అడుగులు, నీటి నిల్వ 46.355 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో 3,183 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,542 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. కాకతీయ కాలువకు 1,215, లక్ష్మీ కాలువకు 215, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 360 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.