హైదరాబాద్: 28°C
తెలంగాణ

రికార్డు ధర పలికిన లడ్డూ..!

HNK: హన్మకొండ శ్రీనగర్ కాలనీలోని ఓం శ్రీ విఘ్నేశ్వర గజానన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాటకు విశేష స్పందన లభించింది. కాలిఫోర్నియాలోని లంబోదర విల్లాస్‌కు చెందిన దుంపల కుమారస్వామి,బిక్షపతి, రఘుపతి రూ.7,51,116లకు లడ్డూను దక్కించుకున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సంప్రదాయాలపై వారు చూపుతున్న భక్తిశ్రద్ధలను స్థానికులు అభినందించారు.