హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసర ట్రిపుల్ ఐటిీలో పరీక్షలు వాయిదా

NRML: గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రభుత్వం సెప్టెంబర్‌ 25న సెలవు ప్రకటించినందున ఆర్‌జీయూకేటీ–ట్రిబుల్‌ ఐటీ బాసరలో ఈ నెల 25, 26 తేదీల్లో జరగాల్సిన రీమెడియల్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం తెలిపింది. పరీక్షల తదుపరి తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.