హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల బస్సును ఢీకొని యువకుడి మృతి

HNK: దామెర మండల కేంద్రంలో పాఠశాల బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. బుధవారం వరంగల్‌ శంభునిపేటకు చెందిన ఆరుద్ర వెంకటేష్‌ (28) బైక్‌పై గుడెప్పాడ్‌కు వెళ్తుండగా ఏకశిల పాఠశాల వద్ద బస్సును ఢీకొని డివైడర్‌పై పడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.