హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ఢీకొని యువకుడి మృతి

MHBD: మహబూబాబాద్‌ మండలం ఈదులపూసపల్లి సమీపంలో మంగళవారం రాత్రి కారు ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న పొన్నాల వెంకన్న (23) మృతిచెందాడు. చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన వెంకన్న తన బావ ప్రేమ్‌కుమార్‌తో కలిసి మహబూబాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.