హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు

PDPL: జూలపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు బుధవారం సాయంత్రం వైభవంగా జరిగాయి. భక్తులు 'గణపతి బప్పా మోరియా, మళ్లీ రావయ్యా' అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్రగా బయలుదేరారు. డీజే, డప్పు వాయిద్యాల నడుమ యువత నృత్యాలతో సందడి చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసి వేడుకలను ప్రశాంతంగా ముగించారు.