హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగోల్లో మట్టి వినాయకుడిని సందర్శించిన అధికారులు

HYD: నాగోల్లో తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72అడుగుల మట్టి వినాయకుడిని తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి సందర్శించారు. పర్యావరణహితంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని జయేశ్ రంజన్ సూచించారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితర అధికారులు పాల్గొన్నారు.