SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం 572 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంపీడీవో పల్లపు ఝాన్సీ తెలిపారు. బుధవారం సాయంత్రం పింఛన్ల దరఖాస్తుల పరిశీలనను తనిఖీ చేసి మాట్లాడారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తికావస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
చేయూత పింఛన్లకు 572 దరఖాస్తులు: MPDO


