హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలోనే రికార్డు ధర పలికిన వినాయకుని లడ్డూ

NLG: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి సన్నిధిలో నవరాత్రుల పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్‌లోని ఒకటో విగ్రహం వద్ద లడ్డూను రూ.5,11,000లకు పర్వతం అశోక్ బుధవారం సాయంత్రం దక్కించుకున్నారు. గత ఏడాది రూ.5 లక్షలు పలకగా ఈ ఏడాది రూ.11 వేలు అదనంగా పలికిందన్నారు.