హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు'

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణపతి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డూను రూ.85,316లకు ముస్లిం దంపతులు కైవసం చేసుకున్నారు. వేలం పాటలో గణపతి లడ్డూను ముస్లింలు సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారని మండపం నిర్వాహకులు తెలిపారు.