హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ASF: ఆసిఫాబాద్‌లోని వట్టివాగు ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 239.050 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.700 టీఎంసీల నీరు ఉంది. 650 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. వర్షం కొనసాగుతున్నందున గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.