హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి సీతక్క ములుగు పర్యటన షెడ్యూల్

MLG: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మామిడిగూడెం, కొమరం భీమ్ కాలనీలో నూతన పాఠశాలలు ప్రారంభిస్తారు. మల్లూరులో హేమాచల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. మంగపేటలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కాటాపూర్‌లో విద్యార్థులకు కంప్యూటర్లు అందించి ప్రహరీ గోడను ప్రారంభిస్తారు.