JGL: మెట్పల్లిలో బుధవారం కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుకలను ఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. వట్టివాగు నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి పోలీసుల బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. పురపాలక అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ


