HNK: వాతావరణ సూచనల నేపథ్యంలో జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా సెప్టెంబర్ 24(నేడు) అంగన్వాడీ కేంద్రాలు,పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు HNK జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. దీనికి బదులుగా అక్టోబర్ 10న రెండో శనివారం పనిదినంగా భావించాలని స్పష్టం చేశారు. ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు


