హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హరిణి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి'

KMM: నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసులోని నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.