హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: ఎస్పీ

KDP: సిద్దవటం మండలంలోని APSP 11వ బెటాలియన్‌లో ఈ నెల 26న జరగనున్న 548 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ రిహార్సల్‌ను SP నచికేత్ విశ్వనాథ్ బుధవారం పరిశీలించారు. పరేడ్ కవాతు, డ్రిల్,మార్చింగ్, క్రమశిక్షణ, సమన్వయాన్ని పరిశీలించారు. పూర్తి ఆత్మవిశ్వాసం, సమయపాలనతో పాల్గొనాలని SP సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.