హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైవీయూలో పీజీ సీట్ల కేటాయింపు జాబితా విడుదల

కడప: ఏపీ పీజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2026 సీట్ల కేటాయింపు జాబితా బుధవారం విడుదలైంది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24, 25 తేదీల్లో రిపోర్ట్ చేయాలని ప్రవేశాల సంచాలకులు ప్రొ. వి. రామకృష్ణ తెలిపారు. ముందుగా వెబ్‌సైట్‌లో ‘సెల్ఫ్‌ రిపోర్ట్’ చేసుకుని, సీటు కేటాయింపు పత్రాల కాపీలతో వైవీయూకు రావాలని సూచించారు.