KNR: పట్టణంలోని పాత బజార్ వినాయకుడి లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. సీనియర్ కరాటే మాస్టర్ కే.వసంత్ కుమార్-విద్యారాణి రూ.23,116కు లడ్డూను దక్కించుకున్నారు. 2013 సంవత్సరం నుంచి వరుసగా 13 సార్లు లడ్డూను దక్కించుకోవడంతో మండపం నిర్వాహకులు, పాతబజార్ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. లడ్డూ వేలం కార్యక్రమంలో భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
వరుసగా 13 సార్లు వినాయకుడి లడ్డూ సొంతం


