SS: పెనుకొండ కొండపై విజయనగర సామ్రాజ్య తొలి దశకు చెందిన ప్రాచీన శాసనం వెలుగులోకి వచ్చింది. నాగలింగేశ్వరస్వామి ఆలయంలోని రాతిగుండుపై ఉన్న శాసనం క్రీ.శ. 1363లో శివలింగ ప్రతిష్ఠకు సంబంధించినదని చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. శాసనం కన్నడ-తెలుగు లిపిలో ఉందన్నారు. ఆలయంలో నాగకన్యల శిల్పాలు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పెనుకొండలో మరో ప్రాచీన శాసనం'


