హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కోడూరులో పోలీసుల డప్పు సందడి

కృష్ణా: కోడూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసు అధికారులు సందడి చేశారు. పూణేకు చెందిన తీన్మార్ డప్పు కళాకారులతో కలిసి డప్పులు వాయించారు. లాఠీలు పట్టే చేతులతో డప్పు కర్రలు అందుకుని ఉత్సాహంగా దరువు వేశారు. ఖాకీ దుస్తుల్లో అధికారులు డప్పులు వాయించడాన్ని చూసి స్థానికులు, యువత ఉత్సాహంగా చప్పట్లు, ఈలలతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ గా మారింది.