హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వృక్షాన్ని తొలగించిన పోలీసులు

VZM: భారీ వర్షాల కారణంగా డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగవరం గ్రామంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. దీంతో విజయనగరం నాతవరం వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానిక ఎస్సై సన్యాసినాయుడు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకొని అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని యంత్రాలతో తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.