PDPL: ఓదెల మండలం పెద్ద కొమిరె మంచిల బావి సమీపంలో ఈరోజు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రన్నింగ్ కరెంట్‌ను చాకచక్యంగా ఆఫ్ చేసి ట్రాన్స్‌ఫార్మర్లలోని విలువైన కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు. విద్యుత్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్ చోరీ


