హైదరాబాద్: 28°C
తెలంగాణ

వడ్ల నివేదితకు ఫస్ట్ ప్రైజ్

SRD: జాతీయ స్థాయి ఆన్‌లైన్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్-2026 పోటీల్లో అమీన్పూర్ పట్టణానికి చెందిన కుమారి వడ్ల నివేదిత విశేష ప్రతిభ కనబరిచారు. కూచిపూడి నృత్య విభాగంలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన నివేదిత ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి విజేతగా నిలిచిన నివేదితకు సంస్థ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని అందజేసి, అభినందనలు తెలిపారు.