W.G: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉండి మండలంలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని ఉండి తహసీల్దార్ మంతెన రామప్రసాద్ కోరారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉండాలన్నారు. ఉండి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. చెట్లు వద్ద ఉండొద్దని పిడుగులు పడే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలంతా సురక్షిత ప్రాంతాలలో ఉండండి'


