హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్వాపూర్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పరిశీలన

BHNG: భువనగిరి మండలం బస్వాపూర్ ప్రాజెక్టు పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం, అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య ఇవ్వాళ పరిశీలించారు. ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇంకా పరిహారం అందాల్సిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.