హైదరాబాద్: 28°C
తెలంగాణ

YTPS వద్ద రేపు బీఆర్‌ఎస్ నిరసన

NLG: రైతులకు విద్యుత్‌ సరఫరా, పంటల సాగుకు నీటి లభ్యతపై BRS ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వద్ద నిరసన చేపట్టనున్నారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని మాజీ MLA భాస్కర్‌రావు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు.