SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి పూజలు అందుకున్న వినాయకుడి నిమజ్జనం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా భీమేశ్వర స్వామి ఆలయంలో మట్టి గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజా క్రతువులు నిర్వహించారు. సాయంత్రం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.
తెలంగాణ
ఘనంగా భీమేశ్వర ఆలయ గణపతి నిమజ్జనం


