హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ‌కి గుడ్ బై

కోనసీమ: మండపేట 27వ వార్డు మాజీ కౌన్సిలర్ బెల్లపుకొండ దొరబాబు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీకి చెందిన పలువురితో పాటు సుమారు 60 మంది తటస్థులు టీడీపీ కండువా కప్పుకున్నారు. మండపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వేగుళ్ల కృషి చేస్తున్నారని దొరబాబు కొనియాడారు.