హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టు కూలి భారీగా ట్రాఫిక్ జామ్

MNCL: జన్నారం మండల కేంద్రంలోని ఆదిలాబాద్‌-మంచిర్యాల ప్రధాన రహదారిపై గ్రీన్ మూన్ రెస్టారెంట్ సమీపంలో బుధవారం చెట్టు కూలిపోయింది. దీంతో రహదారిపై బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.