హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామలో భారీ వర్షం

NTR: నందిగామ ప్రాంతంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా స్వగ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.