హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల విధులకు ఆటంకం.. కేసు నమోదు

ఆదిలాబాద్‌లో గణపతి నిమజ్జన బందోబస్తులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన ముగ్గురిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు CI నాగరాజు తెలిపారు. ఈ మేరకు కౌన్సిలర్ జీవన్‌తో పాటు రామకృష్ణ, అరుణ్‌లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు.