హైదరాబాద్: 28°C
తెలంగాణ

గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలి: ZP సీఈవో

MDK: ఆరోగ్యవంతమైన కుటుంబం కోసం పోషకాహారం తీసుకోవాలని ZP సీఈవో ఎల్లయ్య సూచించారు. తూప్రాన్ IDOC భవనంలో ICDS ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం చేపట్టగా, జ్యోతి ప్రజ్వలన చేసి జడ్పీ సీఈవో ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పిల్లల ఎదుగుదల బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శాలిక, ఎంపీవో సతీష్, సూపర్వైజర్ శివకుమారి పాల్గొన్నారు.