హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌ను బుధవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే శంకర్ సందర్శించారు. వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. బస్టాండ్‌లోకి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.