హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వందే భారత్‌ రైలులో మంటలు

NTR: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. రైలులోని సీ4 బోగీలో ఒక్కసారిగా పొగలు, మంటలు కనిపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి బయటకు వచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.